Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి సగటు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను తాను..

Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

Bandla Ganesh

Updated On : November 18, 2021 / 4:20 PM IST

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి సగటు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న బండ్ల గణేష్ సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని మరింత గర్వంగా కూడా చెప్పుకుంటాడు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తించే బండ్ల గణేష్ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని తెగ పొగిడేశాడు. అందుకు కారణాన్ని కూడా వీడియో రూపంలో ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

బుధవారం అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కళాకారులకు ఏదైనా సహాయం చేయాల్సిందిగా యోదా డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజ్మెంట్ ను విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత.. ‘మా’ మెంబర్స్ తో పాటు 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే వారందరికి వారు అందించే వైద్య సేవలలో 50 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని ప్రకటించారు.

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

చిరు అడగడం వాళ్ళు కాదనకుండా యాభై శాతం రాయితీ ఇవ్వడంతో సినీ పరిశ్రమలో పనిచేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా ఈ వీడియోని బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు బండ్ల ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.