Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’,

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

Rashi Khanna

Updated On : November 18, 2021 / 3:34 PM IST

Rashi Khanna: తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’లో నటిస్తున్న రాశి మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్ లో రెండు వెబ్‌ సిరీస్‌లను పూర్తి చేసింది. ఇందులో ఒకటి షాహిద్‌ హీరోగా ‘సన్నీ’ కాగా మరొకటి అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందిన ‘రుద్ర’. ఇక ఇప్పుడు ఇవి బయటకి రాకుండానే రాశికి మరో బంపర్ అఫర్ దక్కినట్లు తెలుస్తుంది.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

రాశిఖన్నాకు బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ బ్యానర్ లో నటించే ఆఫర్ దక్కినట్లు బీ టౌన్ కథనం ఒకటి చక్కర్లు కొడుతోంది. కరణ్ నిర్మాణంలో యాక్షన్‌ ఫ్రాంచైజీ ఒకటి రూపొందనున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తెరకెక్కించనున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీతో పాటు ఇతర బాలీవుడ్ ప్రధాన తారాగణంగా మొదలు కానున్న ఈ యాక్షన్‌ ఫ్రాంచైజీకి ఇప్పటికే ‘యోధ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పుష్కర్‌ ఓజా అనే కొత్త దర్శకుడు ఈ ప్రాంచైజీకి దర్శకత్వం వహించనున్నాడు.

Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

కాగా.. ఇప్పుడు ఈ యాక్షన్ ప్రాంచైజీలో రాశిఖన్నా కూడా ఆఫర్ దక్కించుకున్నట్లు వినిపిస్తుంది. రాశీ కొంతకాలంగా ముంబైలోనే మకాం వేసి బాలీవుడ్ లో గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇందులో భాగంగానే వరసగా రెండు వెబ్ సిరీస్ లకు ఒకే చెప్పింది. ఇక ఇప్పుడు ఇలా కరణ్ బ్యానర్ లో అవకాశం అంటే అది రాశీ కెరీర్ కి బాగా ఉపయోగపడనుంది. ఇందులో మంచి క్యారెక్టర్ పడితే రాశీ బీటౌన్ లో పాతుకుపోవడం గ్యారంటీ అని అమ్మడి అభిమానులు ఆనందపడిపోతున్నారు.