Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫోకస్ చేసి అదరగొట్టేందుకు సిద్దమయ్యాడు. బన్నీ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్..

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

Allu Arjun Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫోకస్ చేసి అదరగొట్టేందుకు సిద్దమయ్యాడు. బన్నీ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చినా పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే మేకర్స్ ఒక్కో టీజర్, ఒక్కో పాటతో అభిమానులకు కిక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అప్డేట్స్, సింగిల్స్ సినిమా ప్రచారానికి చాలా ఉపయోగపడ్డాయి.

Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి తెలుగు, తమిళ, మలయాళంలో ప్రచారానికి ఎలాంటి డోకా లేదు. కానీ, మిగతా భాషలు ముఖ్యంగా హిందీలో ఇది చాలదు. ఎందుకంటే బాలీవుడ్ ఈ నెల నుండే సినిమాల జాతర మొదలు కానుంది. అలాంటి సమయంలో తొలిసారి పాన్ ఇండియా సినిమాగా వెళ్తున్న అల్లు అర్జున్ సినిమాకి ప్రమోషన్ చాలా అవసరం. పాన్ ఇండియా సినిమా అంటే హిందీ మార్కెట్ చాలా కీలకం. మలయాళ నటులతో పాటు తమిళంలో కూడా బన్నీకి మార్కెట్ ఉండడంతో ఇక్కడ చింతించాల్సిన అవసరం లేదు.

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

ఇక, మిగిలింది బాలీవుడ్ మాత్రమే కావడంతో ఇకపై ఇక్కడే ప్రమోషన్ దిశగా పుష్ప యూనిట్ సిద్దమవుతుంది. ప్రస్తుతం ఇంకా సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అది కాస్త పూర్తిచేసుకొని హిందీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారట. రష్మికకు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెరగడం.. బన్నీ సినిమాలు డబ్బింగ్ రూపంలో ఇప్పటికే నార్త్ సైడ్ యూత్ లో ఫాలోయింగ్ ఉండడం లాంటి అడ్వాంటేజ్ లను వాడుకుంటూ ఈ ప్రమోషన్ చేపట్టేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట. ఈ ప్రమోషన్ ఏ స్థాయిలో ఉంటే సినిమా అక్కడ సక్సెస్ అదే స్థాయిలో ఉంటుంది.