RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం..

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

Rajamouli Ss

Updated On : November 18, 2021 / 1:58 PM IST

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం..

Nataraj Master : మళ్లీ తండ్రైన నటరాజ్ మాస్టర్..

దర్శకధీరుడు రామమౌళి దర్శకత్వంలో.. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, చరణ్, తారక్ టీజర్లకు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ‘నాటు నాటు’ పాట నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయ్యింది.

Pushpa Movie : ఐకాన్ స్టార్ క్రేజ్ పీక్స్.. తమిళనాడులో థియేట్రికల్.. మలయాళంలో శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

ముందుగా పది భాషల్లో విడుదల చెయ్యాలనుకున్నారు కానీ సమయం సరిపోవడం లేదు. దీంతో ఆయా భాషల్లో సబ్ టైటిల్స్‌తో.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

ఇప్పటికే అక్షరాలా పది వేలకు పైగా స్క్రీన్స్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. కీరవాణి సంగీతమందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్, శ్రీనివాస మోహన్ వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..