Nataraj Master : మళ్లీ తండ్రైన నటరాజ్ మాస్టర్..

నటరాజ్ మాస్టర్ భార్య నీతు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు..

Nataraj Master : మళ్లీ తండ్రైన నటరాజ్ మాస్టర్..

Nataraj Master

Updated On : November 18, 2021 / 11:13 AM IST

Nataraj Master: పాపులర్ కొరియోగ్రాఫర్.. , తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 5 కంటెస్టెంట్, టాలీవుడ్‌లో పలు టీవీ షోలు, ఈవెంట్స్ అండ్ మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్ రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య నీతు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Krithi Shetty : ‘నాగ లక్ష్మీ’ గా కృతి శెట్టి..

తాను కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టిందని.. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్‌కి థ్యాంక్స్ అంటూ పాప పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన హ్యాపీనెస్‌ని నెటిజన్లతో పంచుకున్నారు నటరాజ్ మాస్టర్. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 2009లో ఆట 2 కంటెస్టెంట్ నీతుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయన.

Veedhi

 

నటరాజ్ మాస్టర్, నీతు దంపతులకు ఇంతకుముందు ఒక పాప ఉంది. డ్యాన్స్ బేబి డ్యాన్స్, ఆట వంటి షోలతో పలు రియాలిటీ షోలకు జడ్జ్‌గా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా కూడా పనిచేసిన నటరాజ్.. శర్వానంద్ ‘వీధి’ సినిమాతో నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ‘సై’, ‘చక్రం’, ‘గొడవ’, ‘హైవే’ వంటి సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Natrajmaster (@natraj_master)