Pushpa Movie : ఐకాన్ స్టార్ క్రేజ్ పీక్స్.. తమిళనాడులో థియేట్రికల్.. మలయాళంలో శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

ఐదు భాషల్లో.. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న భారీ రిలీజ్‌కి రెడీ అవుతోంది ‘పుష్ప’..

Pushpa Movie : ఐకాన్ స్టార్ క్రేజ్ పీక్స్.. తమిళనాడులో థియేట్రికల్.. మలయాళంలో శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

Allu Arjun Pushpa

Updated On : November 18, 2021 / 12:22 PM IST

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ – ది రైజ్.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

స్టార్ హీరోయిన్ సమంత ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లకు, మూడు పాటలకు రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. శుక్రవారం ఉదయం ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే నాలుగో సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

Samantha : ‘పుష్ప’ ఐదో పాట అదిరిపోద్దంతే.. సమంత ఐటమ్ సాంగ్ కన్‌ఫామ్

ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న భారీ రిలీజ్‌కి రెడీ అవుతోంది ‘పుష్ప’. థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ క్రేజీ రేటుకి సేల్ అయిపోతున్నాయి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్ రూ. 6 కోట్లకు దక్కించుకుంది. అలాగే మలయాళం శాటిలైట్ రైట్స్ ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది.

Pushpa The Rise : బన్నీ రంగంలోకి దిగితే కానీ.. డిస్ట్రిబ్యూటర్ మాట వినలేదు..