Paparazzis : మమ్మల్ని జూమ్ చేయొద్దు.. ప్యాప్స్ పై ఫైర్ అవుతున్న కన్నడభామలు.. పాపరాజీలు ఇకనైనా మారాలి..
బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ జనాల్లో ఉండటానికి డబ్బులిచ్చి మరీ ఈ పాపరాజీస్ ని పెట్టుకుంటారు. (Paparazzis)
Paparazzis
- హద్దు మీరుతున్న పాపరాజీస్
- ఇబ్బంది పడుతున్న హీరోయిన్స్
- ప్యాప్స్ పై ఫైర్ అయిన కన్నడ భామలు
Paparazzis : ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే వినిపించే పాపరాజీస్, ప్యాప్స్ ఇప్పుడు సౌత్ లో, తెలుగు సినీ పరిశ్రమలో కూడా వినిపిస్తుంది. ఏదైనా సినిమా ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది సోషల్ మీడియా పేజెస్ వాళ్ళు వచ్చే సెలబ్రిటీలను వీడియోలు తీసి వారి పేజెస్ ద్వారా ప్రమోట్ చేస్తారు. అయితే బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ జనాల్లో ఉండటానికి డబ్బులిచ్చి మరీ ఈ పాపరాజీస్ ని పెట్టుకుంటారు.
ఈ పాపరాజీస్ ఇటీవల హద్దు మీరి సినిమా ఈవెంట్స్ మాత్రమే కాక సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఉన్నారు, వారు ఎలాంటి బట్టల్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది ప్యాప్స్ హీరోయిన్స్ ని జూమ్ చేసి, వారి ప్రైవేట్ భాగాలని వీడియోలు తీసి, అసభ్యకరమైన యాంగిల్స్ లో వాళ్ళని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Also Read : Gayathri Ramanaa : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. చీరకట్టులో గాయత్రీ రమణ క్యూట్ ఫొటోలు..
కొన్ని రోజుల క్రితం దీనిపై పలువురు హీరోయిన్స్ వ్యతిరేకించగా ఇప్పుడు వరుసగా కన్నడ భామలంతా ప్యాప్స్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణి వసంత్ లు తమ ఇన్స్టాగ్రామ్ స్టోరిలలో ప్యాప్స్ పై ఫైర్ అయ్యారు.
కొంతమంది పాపరాజీస్ హీరోయిన్స్ ని అసభ్యకరమైన యాంగిల్స్ లో, క్లోజ్ గా, అక్కర్లేకుండా జూమ్ చేసి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఒక మహిళగా , సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు. మేము ఇక్కడ సినిమా చేయడానికి, మా కళ ని చూపించడానికి మాత్రమే ఉన్నాము. ఇలాంటి వీడియోల్ని మేము ఖండిస్తున్నాము. దీనిపై మేమంతా ఒక్కటిగా నిలబడతాము అంటూ పోస్ట్ చేసారు. దీంతో మరికొంతమంది నటీమణులు ఈ ప్యాప్స్ పై ఇలాంటి పోస్టులే చేస్తున్నారు.

Also Read : Virosh Media Meet : విజయ్ దేవరకొండ రష్మిక స్పెషల్ మీడియా మీట్.. కొత్త జంట క్యూట్ ఫొటోలు..
Paparazzis
పాపరాజీస్ కూడా ఇకనైనా మారాలి. గతంలో ఆల్రెడీ పలువురు హీరోయిన్స్ వీళ్ళపై అందరి ముందు ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం ఈవెంట్ కి సంబంధించిన విజువల్స్ తీసుకోకుండా కొంతమంది ప్యాప్స్ హీరోయిన్స్ ని అసభ్యకరంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అంతే కాకుండా చాలామంది ప్యాప్స్ ఈవెంట్స్ లో అడ్డంగా ఉంటూ, సెలబ్రిటీల మీద పడిపోతూ వాళ్ళ దారికి అడ్డం వస్తూ ఈవెంట్స్ లో చాలామందికి ఇబ్బంది కలిగిస్తారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒకేసారి కన్నడ భామలంతా వచ్చారు. వీళ్ళు మారకపోతే మున్ముందు మరింతమంది సెలబ్రిటీలు ప్యాప్స్ పై డైరెక్ట్ గానే ఫైర్ అవ్వాల్సిన పరిస్థితులు రావొచ్చు.

