Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!

ఫ్యాన్స్ కోసం ఫుల్ గా సర్ ప్రైజెస్ రెడీ చేశారు యంగ్ టైగర్. ట్రిపుల్ ఆర్ తో మిస్ చేసుకున్న మూవీ లైనప్ ను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు.

Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!

Jr Ntr

Jr NTR: ఫ్యాన్స్ కోసం ఫుల్ గా సర్ ప్రైజెస్ రెడీ చేశారు యంగ్ టైగర్. ట్రిపుల్ ఆర్ తో మిస్ చేసుకున్న మూవీ లైనప్ ను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే ముందు కొరటాల మూవీకి ముహూర్తం పెట్టేశారు. ఆ తర్వాతే క్రేజీ కబుర్లను చెప్పబోతున్నారు. తారక్ రివీల్ చేయబోతున్న ఆ సీక్రెట్స్ ఏంటన్నది అభిమానులకు ఆసక్తిగా మారింది.

Movie Releases: ఈసారి పక్కా.. డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోలు!

యంగ్ టైగర్ – కొరటాల సినిమాకి ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 7న అధికారికంగా ఈ కాంబో సెట్స్ పైకెళ్లబోతుంది. తారక్ ట్రిపుల్ ఆర్, కొరటాల ఆచార్య లేట్ కారణంగా ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ తీసుకుంది. ఇక ఆలస్యం చేయకుండా కొరటాల డైరెక్షన్లో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు ఎన్టీఆర్.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ట్రిపుల్ ఆర్ తో పెరిగిన పాన్ ఇండియా క్రేజ్ తో తారక్ కోసం పాన్ ఇండియా లైన్ నే కొరటాల ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో యంగ్ టైగర్ సరసన అలియా భట్ మెరవనున్నట్టు చెప్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

కొరటాల సినిమాను 8నెలల్లో పూర్తి చేసి బుచ్చిబాబుతో దసరాకు సినిమా స్టార్ట్ చేయలానేది ఎన్టీఆర్ ప్లాన్. ముందు ప్రశాంత్ నీల్ అనుకున్నా ఆ లైనప్ ఛేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీస్తున్న సలార్ ని రెండు భాగాలుగా మార్చాడు. అంటే 2023లో కూడా ప్రశాంత్ నీల్ సలార్ తోనే బిజీగా ఉంటాడు. అందుకే ఆయనతో సినిమా కన్నా ముందే బుచ్చిబాబు సినిమా పూర్తి చేస్తాడు ఎన్టీఆర్. బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబో మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నారు.