KGF2: ఇట్స్ ఎమోషనల్ టైమ్.. కేజీఎఫ్ కష్టాలను చెప్పుకుంటున్న యష్-దత్!

కేజీఎఫ్ కష్టాలపై ఓపెన్ అవుతున్నారు యశ్, సంజయ్ దత్. ఏప్రిల్ 14న సినిమా రాబోతున్న టైమ్ లో సెంటిమెంట్ టచ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా మదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా ఆడియెన్స్ ముందుకు..

KGF2: ఇట్స్ ఎమోషనల్ టైమ్.. కేజీఎఫ్ కష్టాలను చెప్పుకుంటున్న యష్-దత్!

Kgf2

KGF2: కేజీఎఫ్ కష్టాలపై ఓపెన్ అవుతున్నారు యశ్, సంజయ్ దత్. ఏప్రిల్ 14న సినిమా రాబోతున్న టైమ్ లో సెంటిమెంట్ టచ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా మదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇలా టోటల్ గా ప్రెజెంట్ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్న కేజీఎఫ్ టీమ్ మ్యాటర్ పై ఓ లుక్ వేద్దాం.

KGF2: తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్!

తుఫాన్ సృష్టించిన బీభత్సం తర్వాత కేజీఎఫ్ నుంచి పవర్ఫుల్ మదర్ సెంటిమెంట్ సాంగ్ వచ్చేసింది. ఎదగరా అంటూ మొదలైన ఈ పాట కేజీఎఫ్ చాప్టర్ 1లోని అమ్మ ట్యూన్ ని మరోసారి గుర్తుచేస్తోంది. ఏ మ్యూజిక్ అయితే కె.జి.యఫ్ ఫ్యాన్స్ ను కట్టిపడేసిందో.. అదే ట్యూన్ ని మరింత పవర్ ఫుల్ లా ఆడియెన్స్ ముందుకు మరోసారి తీసుకొచ్చారు.

KGF2: రికార్డు రేటుకు కేజీఎఫ్ 2 నైజాం రైట్స్

సెంటిమెంట్ సాంగ్ తో మెస్మరైజ్ చేయడమే కాదు.. సెంటిమెంట్ డైలాగ్స్ తో అటెక్షన్ గ్రాబ్ చేస్తున్నాడు రాకింగ్ స్టార్. ఎన్నో కష్టాలు ఫేస్ చేసాకే కేజీఎఫ్ లాంటి సాలిడ్ మూవీ బయటికొచ్చిందని అన్నాడు యశ్. బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన లగాన్ సినిమాలా కేజీఎఫ్ సినిమా వెనుక అండర్ డాగ్ టీమ్ పనిచేసిందని చెప్పుకొచ్చాడు. కన్నడ సినిమాను అనదర్ లెవెల్ లోకి తీసుకెళ్లడం వెనుక అందరి కష్టముందన్నాడు.

KGF2: ఆర్ఆర్ఆర్ ఆదర్శం.. జక్కన్న బాటలోనే కేజీఎఫ్ ప్రమోషన్స్!

కేజీఎప్2 కోసం తగ్గేదేలే అన్నట్టు సంజయ్ దత్ నటించిన తీరుని రివీల్ చేశాడు యష్. క్యాన్సర్ నుంచి రికవరీ అయ్యాక.. సినిమా కరెక్ట్ గా రావడం కోసం సంజయ్ దత్ తనను తాను పుష్ చేసుకున్న పాస్ట్ ని గుర్తు చేశారు రాకింగ్ స్టార్. ఈయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెవీ డ్యూటీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించడం కోసం మేకర్స్ గ్రీన్ స్క్రీన్ షూట్ ని రెడీ చేశారు. కానీ బారీ స్కేల్ లో గ్రాండ్ విజన్ తో ప్లాన్ చేసిన హై ఇంటెన్స్ సీన్స్ ను గ్రీన్ మ్యాట్ లో కాకుండా న్యాచురల్ గా మాత్రమే దత్ చేశారు. మడ్, డస్ట్, ఫైర్.. ఇలా దేనిని లెక్కచేయకుండా తాను నటించానంటే కారణం కేజీఎఫ్ టీమ్ అందించిన సపోర్ట్ అని ప్రకటించారు సంజయ్ దత్.