KGF2: రికార్డు రేటుకు కేజీఎఫ్ 2 నైజాం రైట్స్

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా పాన్....

KGF2: రికార్డు రేటుకు కేజీఎఫ్ 2 నైజాం రైట్స్

Record Price For Kgf 2 Nizam Rights

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన కేజీఎఫ్ కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా నార్త్‌లోనూ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ అయిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF2: ఆర్ఆర్ఆర్ ఆదర్శం.. జక్కన్న బాటలోనే కేజీఎఫ్ ప్రమోషన్స్!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలను రెట్టింపు చేశాయి. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను అల్లాడించేందుకు రాఖీ భాయ్ రెడీ అవుతున్నాడని కేజీఎఫ్ అభిమానులు అంటున్నారు. కాగా ఈ సినిమాకు తెలుగునాట కూడా అదిరిపోయే క్రేజ్ నెలకొంది. అయితే ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసే హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 నైజాం రైట్స్‌ను ఏకంగా రూ.50 కోట్ల భారీ రేటుకు ఆయన సొంతం చేసుకున్నాడట.

ఇంత భారీ మొత్తంలో కేజీఎఫ్2 తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకుని.. ఈ సినిమాను నైజంలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఆయన పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 చిత్రం రిలీజ్‌కు ఒక్క రోజు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. కాగా బీస్ట్ చిత్ర రైట్స్‌ను కూడా దిల్ రాజు సొంతం చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక్క రోజు గ్యాప్‌లో రెండు బడా చిత్రాలు రిలీజ్ అవుతుండటం.. రెండు సినిమాల రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో ఆయన ఈ సినిమాలను ఏ విధంగా రిలీజ్ చేస్తారా అనే సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంది.

KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా దిల్ రాజు నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయగా, ఈ సినిమా ఒక్క నైజాంలోనే రూ.100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి దిల్ రాజుకు లాభాల పంటను మిగిల్చింది. మరి బీస్ట్, కేజీఎఫ్2 చిత్రాలతో దిల్ రాజు ఎంతమేర లాభాలను అందుకుంటాడో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.