KGF2: తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్!

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ తొలిభాగం....

KGF2: తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్!

Kgf 2 Solid Pre Release Business In Telugu States

KGF2: ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ తొలిభాగం అందుకున్న సక్సెస్ కారణంగా ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, హీరో యశ్ మరోసారి మాస్ అవతారంలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేందుకు సిద్ధమయ్యాడు.

KGF2: రికార్డు రేటుకు కేజీఎఫ్ 2 నైజాం రైట్స్

ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో సాలిడ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తూ దూకుడును చూపిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ.50 కోట్లకు దక్కించుకోగా, ఏపీ+సీడెడ్ హక్కులు ఏకంగా రూ.60 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది.

తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఓ డబ్బింగ్ సినిమాకు ఇంత భారీ మొత్తంలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమని చెప్పాలి. యశ్ మాస్ పర్ఫార్మెన్స్‌కు దర్శకుడు ప్రశాంత్ నీల్ పవర్‌ప్యాక్డ్ టేకింగ్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

KGF2: ఆర్ఆర్ఆర్ ఆదర్శం.. జక్కన్న బాటలోనే కేజీఎఫ్ ప్రమోషన్స్!

యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రవీనా టండన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇక తొలిభాగంలో నటించిన శ్రీనిధి శెట్టి ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. హింబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కేజీఎఫ్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.50 కోట్లు
సీడెడ్ – రూ.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.10 కోట్లు
గుంటూరు – రూ.8 కోట్లు
ఈస్ట్ – రూ.8 కోట్లు
వెస్ట్ – రూ.7 కోట్లు
కృష్ణా – రూ.6 కోట్లు
నెల్లూరు – రూ.3.5 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.112.5 కోట్లు