Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..

తమిళ క్రైమ్ కామెడి సినిమా 'కొలమావు కోకిల'కు రీమేక్ గా తెరకెక్కింది గుడ్ లక్ జెర్రి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది జాన్వీ. గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో.............

Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..
ad

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, ఘోస్ట్ స్టోరీస్ లాంటి మూవీస్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం తన చేతిలో గుడ్ లక్ జెర్రీతో పాటు మిల్లి, బవాల్, మిస్టర్ అండ్ మిస్ మహీ లాంటి సినిమాలున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సౌత్ ఆడియన్స్ మధ్య చర్చ నడుస్తూనే ఉంది. కాని, జాన్వీ కపూర్ మాత్రం ఇప్పటి దాకా ఏ తెలుగు సినిమాను ఒప్పుకోలేదు. జాన్వీ నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో జులై 29 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి

తమిళ క్రైమ్ కామెడి సినిమా ‘కొలమావు కోకిల’కు రీమేక్ గా తెరకెక్కింది గుడ్ లక్ జెర్రి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది జాన్వీ. గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ”నేను చేసే పనులను ఇష్టపడే టాలెంటెడ్ వ్యక్తి నాకు భర్తగా రావాలి. అలాగే అతను కామెడీ బాగా చేయాలి, సెన్సాఫ్ హ్యూమర్ బాగుండాలి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ, నన్ను ఉత్సాహంగా ఉంచే వాడు, నాతో కలిసిపోయే వాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలి” అని తెలిపింది. మరి ఈ అందగత్తెని చేసుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలి అంటే మరిన్ని సంవత్సరాలు ఆగాల్సిందేనేమో.