Tiger Captured: హమ్మయ్య.. ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు
- పెద్దపులిని విజయవంతంగా బంధించిన స్పెషల్ టీమ్
- పులిని బంధించేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారులు
- కంటి మీద కునుకు లేకుండా పులి
- ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు, ఆధునిక పరికరాల వినియోగం
Tiger Captured: తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆపరేషన్ జాక్ సక్సెస్ అయ్యింది. రెండు రోజులుగా చుక్కలు చూపించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. మధ్యాహ్నం నుంచి పులిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం ఇంట్లో గాండ్రింపులు విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. భయంతో పులి పొలాల్లోకి పరుగులు తీసింది. పొలం నుంచి పార్క్ పాక్ లోకి దూరింది. కొన్నిగంటల పాటు అక్కడే మకాం వేసింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం దూడపై దాడి కూడా చేసింది.
పుణె నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ పాకలోకి దూరిన పెద్దపులి కోసం మధ్యాహ్నం నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అయినా వారి కళ్లుగప్పి పొలాల్లోకి పరిగెడుతుండగా ట్రాంక్వలైజర్ గన్ తో మత్తు మందు ఇచ్చి పెద్దపులిని పట్టుకున్నారు. రెండు రోజులు చుక్కలు చూపించిన, ప్రాణభయం నింపిన పెద్దపులి బోనుకి చిక్కడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: పాస్బుక్లు ట్యాంపర్ చేస్తే జైలుకే.. ఇక మీ భూమిని ఎవరూ టచ్ చేయలేరు- సీఎం చంద్రబాబు
