Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గిందోచ్.. ఒకేసారి రూ. 12,600 తగ్గింపు.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..!
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ లో ఈసారి రూ. 12,600 ధర తగ్గింపు పొందింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 50 Pro
- మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) రూ.35,999కి లాంచ్
- ప్రస్తుతం అమెజాన్‌లో రూ.24,350కి లిస్టింగ్, ధర రూ.11,649 తగ్గింపు
- బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ. 12,600 కన్నా ఎక్కువ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ డిస్ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ 125W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
మీరు ఈ మోటోరోలా ఫోన్ కొనాలని చూస్తుంటే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ముగిసేలోగా కొనేసుకోవడం బెటర్. ఆఫర్ వివరాలు, స్మార్ట్‌ఫోన్ అందించే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్) భారత మార్కెట్లో రూ.35,999కు లాంచ్ అయింది. ఈ మోడల్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.24,350కు లిస్ట్ అయింది. రూ.11,649 నేరుగా ధర డిస్కౌంట్ అందిస్తోంది.
మీరు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్, BOBCard,కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, ఈ మోటోరోలా ఫోన్ 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే.. ఎడ్జ్ 50 ప్రో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్ల వరకు టాప్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో వస్తుంది.
