NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30 | NTR 30

NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30

ట్విట్టర్‌లో #NTR30 హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది..

NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాను షేక్ చేసేస్తారు ఫ్యాన్స్. పర్సనల్, ప్రొఫెషనల్.. మేటర్ ఏదైనా వైరల్ చేసేస్తారు. ఇప్పడు ట్విట్టర్‌లో #NTR30 ఈ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..

ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ కనుక అనుకున్నట్టు జనవరి 7న రిలీజ్ అయి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఏప్రిల్ 29న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!

ఇక ఇప్పుడు తారక్ ఫోకస్ అంతా కొరటాల శివ సినిమా మీదే పెట్టాడు. క్యారెక్టర్‌కి తగ్గట్లు మేకోవర్ అయ్యే పని స్టార్ట్ చేసేసాడని తెలుస్తుంది. కొరటాల కూడా ‘ఆచార్య’ కంప్లీట్ చేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో కూర్చున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, దసరా కానుకగా విడుదల చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు.

NTR 30 : పనిలో పిల్లోడు కాదు.. అందుకే అంత ఇస్తున్నారంట..

తనకు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా కోసం తారక్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.

NTR 30: కొరటాల సినిమా కథ ఇదే.. రివీల్ చేసిన తారక్!

×