Samantha : శోభితతో నాగచైతన్య డేటింగ్? ఫైర్ అయిన సమంత..

గత రెండు రోజుల నుంచి నాగ చైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పలు హిందీ సినిమాల్లో నటించి తెలుగులో గూడాచారి, ఇటీవల మేజర్ సినిమాతో మెప్పించిన శోభిత ధూళిపాళ్లతో.....................

Samantha : శోభితతో నాగచైతన్య డేటింగ్? ఫైర్ అయిన సమంత..

Samantha Naga Chaithanya

Nagachaithanya : నాగచైతన్య, సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్. కానీ వీరిద్దరూ కొన్ని నెలల క్రితం విడిపోయారు. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య ఏం చేసినా వైరల్ గానే మారుతుంది. నెటిజన్లు వీరిద్దరిపై బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. విడిపోయిన తర్వాత ఎవరి కెరీర్ తో వారు బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ వారి పనుల్లో వారు ఉన్నారు. కానీ కొన్ని సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్స్ మాత్రం వీరి పర్సనల్ లైఫ్ గురించి ఇంకా మాట్లాడుతున్నాయి.

గత రెండు రోజుల నుంచి నాగ చైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పలు హిందీ సినిమాల్లో నటించి తెలుగులో గూడాచారి, ఇటీవల మేజర్ సినిమాతో మెప్పించిన శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నట్టు, ఇప్పటికే చై, శోభిత చాలా సార్లు కలిసారని, నాగ చైతన్య శోభితని తన ఇంటికి కూడా తీసుకెళ్లి ఇంటిని చూపించాడని, వీళ్లిద్దరు ఇటీవల ఓ పార్టీకి కూడా కలిసి వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే వీటిపైనా ఇప్పటిదాకా వీరిద్దరూ స్పందించలేదు.

 

Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..

అయితే కొన్ని సైట్స్ వీరిద్దరి డేటింగ్ గురించి మాత్రమే రాయకుండా ఈ పని సమంత చేపించింది. సమంత PR టీం ఈ పుకార్లు పుట్టించిందని రాశారు. ఈ న్యూస్ సమంత వరకు వెళ్లడంతో సమంత ఫైర్ అయింది. గతంలో కూడా సమంతపై వచ్చిన ట్రోల్స్ ని తిప్పికోట్టింది. తాజాగా సమంతనే చైతూ, శోభితకి లింక్ ఉన్నట్టు ప్రమోట్ చేయించింది అని వార్తలు రావడంతో దీనిపై ట్విట్టర్ లో సీరియస్ గా స్పందిస్తూ ట్వీట్ చేసింది సమంత.

ఈ విషయంపై సమంత.. ”అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, కానీ అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మేము ఎప్పుడో మూవ్ అన్ అయిపోయాము. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద ఏకాగ్రత పెట్టండి” అంటూ ట్వీట్ చేసింది. సమంత ఫ్యాన్స్ కూడా ఈ వార్తలని ఖండిస్తున్నారు.