Smriti Mandhana : మంధాన తీవ్రమైన జ్వరంతోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది.. నేను అడిగితే.. ఆర్సీబీ కోచ్ రంగరాజన్ కీలక వ్యాఖ్యలు
ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో స్మృతి మంధాన (Smriti Mandhana) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది
Smriti Mandhana Played WPL Final Despite Flu says Malolan Rangarajan
Smriti Mandhana : డబ్ల్యూపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వడోదర వేదికగా గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు సాధించింది.
ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించంతో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది. అయితే.. మంధాన తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఈ మ్యాచ్ ఆడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ మలోలన్ రంగరాజన్ తెలిపాడు.
వాస్తవానికి మంధాన జ్వరంతో బాధపడుతోంది. అయితే.. ఆ ప్రభావం మ్యాచ్ పై ఏ మాత్రం పడనీయలేదు. నేను ఆమెతో మాట్లాడినప్పుడు నో ప్రాబ్లం నేను ఆడతాను అని ఆమె అంది అని రంజగరాజన్ చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్‌లో మంధాన ఆడిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి తన వద్ద మాటలు లేవని తెలిపాడు. గత కొన్నాళ్లుగా ఆమె భీకర ఫామ్‌లో ఉంది. బంతిని చక్కగా టైమింగ్ చేస్తోంది. అవసరమైనప్పుడు అటాకింగ్ గేమ్ ఆడుతోందన్నాడు.
Virat Kohli : డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఏ సందేశం పంపాడో తెలుసా?
ఇక నిరంతరం తన బ్యాటింగ్‌ను మెరుగు పరచుకునేందుకు మంధాన ప్రయత్నిస్తూ ఉంటుందని, ఆమె ఓ గొప్ప మేధావి అని, అందుకనే ఆమె జీవితంలో ఇంతటి విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చాడు.
