Tamannaah : తమన్నా ఇష్టాయిష్టాలు.. తమన్నా కష్టాలు.. ఫ్యాన్స్‌తో స్పెషల్ చిట్ చాట్..

ఇటీవలే F3 సినిమాతో మెప్పించిన తమన్నా తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి తమన్నా సమాధానాలిచ్చింది....

Tamannaah : తమన్నా ఇష్టాయిష్టాలు.. తమన్నా కష్టాలు.. ఫ్యాన్స్‌తో స్పెషల్ చిట్ చాట్..

Tamannaah

Tamannaah :  కెరీర్ మొదలుపెట్టి దాదాపు 17 సంవత్సరాలవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. శ్రీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఇంకా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు అరడజనుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో తెలుగులో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం, చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలే F3 సినిమాతో మెప్పించిన తమన్నా తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది.

ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి తమన్నా సమాధానాలిచ్చింది. భోళాశంకర్ లో చిరంజీవితో డ్యాన్స్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి చిరంజీవితో కచ్చితంగా డ్యాన్స్ చేస్తున్నాను అది మీ అందర్నీ అలరిస్తుంది అని తెలిపింది. అలాగే f3 లో అబ్బాయిలా నటించిన దాని గురించి అడగగా.. ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం అనిపించింది. కానీ అది చేసినప్పుడు నాలోని రౌడీ బయటకి వచ్చాడు అని తెలిపింది. యాక్షన్ అండ్ రొమాన్స్ సినిమాల్లో నటించడం ఇష్టం అని చెప్పింది. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అడిగిన దానికి బుక్స్ చదువుతాను, పాడ్ కాస్ట్ వింటాను, వర్షాకాలంలో వర్షంలో డ్యాన్స్ చేయడం ఇష్టం అని సమాధానం ఇచ్చింది.

777 Charlie : కుక్క మీద తీసిన సినిమా.. లాభాల్లో 5 శాతం కుక్కలకే..

 

అన్ని రకాల దోశలు ఇష్టంగా తింటాను, చదువుకునేటప్పుడు లిటరేచర్, కెమిస్ట్రీ, హిస్టరీ ఫేవరేట్ సబ్జక్ట్స్ అని తెలిపింది. ధర్మాదురై సినిమాలో సుభాషిణి క్యారెక్టర్, బాహుబలిలో అవంతిక క్యారెక్టర్ ఇష్టమని, చాకోలెట్ ఐస్ క్రీం ఇష్టమని, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతానని అది నన్ను భయపెడుతుందని అని తన గురించి అభిమానులకి చెప్పింది. అలాగే ఇటీవల కాన్స్ ఉత్సవంలో భారతదేశం తరపున పాల్గొనడం చాలా గర్వంగా అనిపించింది అని తెలిపింది.