Tollywood : అనుష్క, మణిశర్మ పేరు చెప్పి రూ.66 లక్షలు మోసం..

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. పలానా స్టార్స్ డేట్స్ ఇప్పిస్తాము అంటూ, మోడలింగ్ అవకాశాలు కలిపిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. టాలీవుడ్ లో రోజుల వ్యవధిలో రెండు మోసాలు వెలుగు చూశాయి. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పి దాదాపు రూ.66 లక్షలు మోసం చేసిన ఘటన నేడు వెలుగులోకి వచ్చింది.

Tollywood : అనుష్క, మణిశర్మ పేరు చెప్పి రూ.66 లక్షలు మోసం..

Tollywood : ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. పలానా స్టార్స్ డేట్స్ ఇప్పిస్తాము అంటూ, మోడలింగ్ అవకాశాలు కలిపిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. టాలీవుడ్ లో రోజుల వ్యవధిలో రెండు మోసాలు వెలుగు చూశాయి. రెండు రోజులు క్రిందట బాలీవుడ్ కి సంబంధించిన ఇద్దరి నటీనటుల పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయ్యింది. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు కలిపిస్తామంటూ బాలీవుడ్ యాక్టర్స్ అపూర్ అశ్విన్, నటాషా కపూర్ మోసాలకు పాల్పడుతున్నారు.

Oscar Nominated Indian Movies : భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాలివే..

కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో ఒక వెబ్ సైట్ రన్ చేస్తూ ప్రముఖ వ్యాపార వేత్త నుంచి సుమారు రూ.20 లక్షలకు పైగా వాసులు చేసి మోసం చేసినట్లు సైబర్ క్రైమ్ లో కేసు నమోద అయ్యింది. సొసైటీలో పేరున్న వ్యాపార వేత్తల పిల్లలనే టార్గెట్ చేసుకొని వీరిద్దరూ ఈ దందా నడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి.. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పి దాదాపు రూ.66 లక్షలు మోసం చేసిన ఘటన నేడు వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ సంబంధించిన మేనేజర్ ఎల్లారెడ్డి అనే వ్యక్తి అనుష్క డేట్స్ ఇప్పిస్తాను అంటూ చెప్పి నిర్మాత లక్ష్మణ్ నుంచి రూ.51 లక్షలు వాసులు చేశాడు. అలాగే మణిశర్మను కూడా ఒప్పిస్తాను అంటూ మరో రూ.15 లక్షలు నొక్కేసి ఏ విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. మేనేజర్ ఏ విషయం చెప్పకపోవడంతో నిర్మాత లక్ష్మణ్ ఏమి చేయాలో తెలియక ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు. ఎక్కువ మాట్లాడితే ఇంటిలో ఆడవాళ చేత కేసు పెట్టిస్తాను అంటూ నిర్మాతని బెదిరించాడు. ఇక చేసేది లేక నిర్మాత లక్ష్మణ్ పోలీసులకు పిర్యాదు చేశాడు.