PM Modi Hug : ఆలింగనాలతో దేశాధినేతలకు దగ్గరైన మోదీ .. ప్రపంచ దేశాలకు హగ్ దౌత్యం పరిచయం చేసిన భారత ప్రధాని

ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ దేశాధినేతలకు దగ్గర చేసింది. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంబంధాలక పునాదులు వేస్తోంది. సత్సంబంధాలను కొనసాగిస్తోంది. మోదీ కౌగిలింతకు ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేస్తోంది.

PM Modi Friendship World Leaders : ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ దేశాధినేతలకు దగ్గర చేసింది. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంబంధాలక పునాదులు వేస్తోంది. సత్సంబంధాలను కొనసాగిస్తోంది. మోదీ కౌగిలింత ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేస్తోంది. ప్రపంచ దేశాధినేతల్లో అందరిదీ ఓ లెక్క ప్రధాని మోదీది మరో లెక్క అన్నట్లుగా ఉంటుంది. దేశాధినేతలకు ఇతర దేశాల నాయకులతో వ్యూహాత్మక స్నేహం ఉంటుంది. అయితే మోదీ లెక్క వేరు. భారత ప్రధానిని ఎవరైనా దోస్త్‌ మేరా దోస్త్ అనాల్సిందే అన్నట్లుగా ఉంటుంది ఆయనతో వ్యవహారం. ఆయన మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఆయన మాటలు వింటే  ఆప్యాయతగా దగ్గరకు తీసుకోవాల్సిందే. దీనికి మోడీ చేసిన మ్యాజిక్ ఏంటి..? ఏ దౌత్యం మోడీని .. ఇతర దేశాల నేతలకు అత్యంత ఆప్తుడిని చేసింది..? మోదీ ఆత్మీయ ఆలింగనాలకు ప్రపంచ దేశాధినేతలు ఫిదా అవుతున్నారు. షేక్ హ్యాండ్ సంస్కృతి ఉన్న నేతలు కూడా మోదీని ఆలింగనం చేసుకుంటున్నారు. ఇదే మోదీ హగ్ ల క్రేజ్ అన్నట్లుగా ఉంది.

 

ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని క్రేజ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది. కేవలం ప్రజలే కాదు.. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు సైతం మోదీకి ఫిదా అవుతున్నారు. ఏం మంత్రం వేశారో.. ఏ మాయే చేశారో తెలియదు. కాని ఒక్క హగ్‌తో ప్రపంచ దేశాల నేతలను ప్రాణ స్నేహితులుగా చేసుకుంటున్నారు మోదీ. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మోదీ ప్రపంచ పర్యటనలకు వెళ్లినప్పుడు .. మొదట మోదీ ఆలింగనాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన నేతలే.. ఇప్పుడు స్వయంగా మోదీని వచ్చి హగ్‌ చేసుకోవడం విశేషం. ఇంతలా మోదీ తన హగ్స్‌తో వారి మనసు గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, జీ7 సమావేశాలకు జపాన్‌లో పర్యటించారు మోదీ ఎక్కడకు వెళ్లినా మోదీకి ఆలింగనాల స్వాగతం లభిస్తోంది.

PM Modi-Australia PM Anthony : మోదీజీ మీకు మాటిస్తున్నా.. హిందూ దేవాలయాలపై దాడులు జరిపినవారిపై చర్యలు తీసుకుంటాం : ఆస్ట్రేలియా ప్రధాని

తన ఆలింగనాలతో దేశాధినేతలకు దగ్గరైన మోదీ.. వారి గుండెల్లో స్థానం సంపాదించారు. అందుకే మోదీ విదేశీ పర్యటన సందర్భంగా వారి నుంచి వచ్చే రియాక్షన్ అంత గొప్పగా ఉంటోంది. చాలా కాలం తర్వాత ప్రాణ స్నేహితుడు వస్తే ఎలా రీసీవ్‌ చేసుకుంటారో అలాగే.. మోడీకి అధ్యక్షులు, ప్రధానులు స్వాగతం పలుకుతున్నారు. ఇదే విధంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్.. మోడీని డియర్ ఫ్రెండ్‌ అంటూ ఆలింగనం చేసుకున్నారు. అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన జనసందోహం వారి రెస్పాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది.

 

అటు పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా .. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే తీరు అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఏకంగా ప్రధాని మోడీ కాళ్లకు నమస్కారం పెట్టారు. దానిని ఆపి జేమ్స్ మరాపేను హగ్‌ చేసుకున్నారు మోడీ. ఇది ప్రపంచ దేశాధినేతలకు సైతం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక దేశ ప్రధాని మరో దేశ ప్రధాని ఇంతలా గౌరవించడం చూసి ఉండరు. దీనికి మోడీ ఆ దేశంతో.. ఆ దేశాది నేతలతో చూపించే స్నేహానికి నిదర్శనమంటున్నారు. పపువా న్యూ గినియా పర్యటనలో మోదీకి ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. పపువా న్యూ గినియా కూడా అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించింది. ఇది మోడీపై వారికున్న అభిమానాన్ని చాటుతోంది.

K Laxman: 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇన్ని కేటాయించాం: ఎంపీ లక్ష్మణ్

సాధారణంగా దేశాధినేతలు కలిసినప్పుడు షేక్‌ హ్యాండ్స్‌తో సరిపెట్టుకుంటారు. కాని మోదీ పరిచయం చేసిన హగ్స్.. మాయే వేరంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం దీనికి ఫిదా అయ్యారు. అందుకే జపాన్‌లో జీ7 సమావేశాల సందర్భంగా మోదీ దగ్గరకు స్వయంగా వచ్చి హగ్ ఇచ్చారు. సమావేశంలో ఎంతో మంది నేతలున్నా.. వారికి లభించని అరుదైన గౌరవం మోదీకి దక్కింది. భేటీ సందర్భంగా బైడెన్.. చైనాతో పోలుస్తూ భారత్ పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన మోడీ, బైడెన్ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. అమెరికా ప్రజలంతా మీ గురించి ఎదురు చూస్తున్నారని చెప్పారు. జూన్‌లో మోదీ అమెరికా వెళ్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది అగ్రరాజ్యం. అటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్నేహంగా మాట్లాడారు. ఇప్పుడే కాదు.. ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్‌తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దౌత్య సంబంధానికి కొత్త అర్థం చెబుతున్నారు మోదీ.

 

ట్రెండింగ్ వార్తలు