PM Modi-Australia PM Anthony : మోదీజీ మీకు మాటిస్తున్నా.. హిందూ దేవాలయాలపై దాడులు జరిపినవారిపై చర్యలు తీసుకుంటాం : ఆస్ట్రేలియా ప్రధాని

మోదీజీ మీకు మాటిస్తున్నాను అంటూ మోదీ చేయి పట్టుకుని ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంథొనీ ఆల్బనీస్ హామీ ఇచ్చారు.

PM Modi-Australia PM Anthony : మోదీజీ మీకు మాటిస్తున్నా.. హిందూ దేవాలయాలపై దాడులు జరిపినవారిపై చర్యలు తీసుకుంటాం : ఆస్ట్రేలియా ప్రధాని

PM Modi-Australia PM Anthony

PM Modi – Australia PM Anthony : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ఓ మాటిచ్చారు. మోదీజీ మీకు మాటిస్తున్నాను అంటూ మోదీ చేయి పట్టుకుని మరీ మాటించ్చారు. ఇంతకీ ఆమాటేమంటే ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంథొనీ ఆల్బనీస్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీయే వెల్లడించారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని ఆంథొనీతో భేటీ అయిన సందర్బంగా ఆయన ఈ మాటిచ్చారు. ఇరు దేశాధినేతలు సమావేశమై పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం, రక్షణరంగం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఆస్ట్రేలియాలో పలు హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు జరిగాయి. ఈ అంశంపై ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానితో చర్చించారు. దానికి ఆయన హామీ ఇచ్చారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అక్కడి హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలో సమావేశంలో మోదీ ప్రస్తావించార ‘‘ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యల గురించి ఆస్ట్రేలియా ప్రధాని, నేను గతంలోనూ చర్చించాము. ఈ సమావేశంలో మరోసారి మాట్లాడాం’’ అని మోదీ తెలిపారు. హిందూ దేవాలయాలపై అవమానకర రాతలు రాస్తూ దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని తనకు హామీ ఇచ్చారని మోదీ తెలిపారు. అలాగే ఆస్ట్రేలియా, భారత్ మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని ఆ సంబంధాలు చెడగొట్టే ఎటువంటి ప్రయత్నాలను మేము సహించం అని అన్నారు.

కాగా గత మార్చిలో ఆస్ట్రేలియాలోని దక్షిణ బ్రిస్బేన్‌లో ఉన్న బర్‌బాంక్‌ సబర్బ్‌లో ప్రముఖ స్వామి నారాయణ్ దేవాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు అభ్యంతరకర రాతలు రాసారు. గోడను ధ్వంసం చేశారు. అంతకుమునుపు మరో మూడు హిందూ దేవాలయాలపై దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. అలా నాలుగు సార్లు దాడులు జరిగాయి. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానితో చర్చించగా ఆయన హామీ ఇచ్చారు.