Revanth Reddy : కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఉంటుంది- రేవంత్ రెడ్డి

Revanth Reddy : 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ ఇస్తే.. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్ మోసం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

Revanth Reddy – Peoples March : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. జనవరిలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలతో విరుచుకుపడ్డారు.

పాలమూరు జిల్లాకు రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందన్నారు రేవంత్ రెడ్డి. 10లక్షల మంది వలసలు పోతుంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పారు.. మరిప్పుడు ఎందుకు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయంగా కేసీఆర్ ను పాలమూరు జిల్లా ప్రజలు అక్కున చేర్చుకుంటే.. పాలమూరు ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారని మండిపడ్డారు. 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ ఇస్తే.. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్ మోసం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఘనత సోనియాగాంధీ అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణాన్ని కేసీఆర్ తీర్చుకోలేరు అన్నారు.

Also Read..Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రూ.2లక్షలు రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీగా 9 రకాల సరుకులు- భట్టి విక్రమార్క

” కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందింది. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే జడ్చర్లకు అవసరం లేదు. పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు 14 గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేస్తాం. 2024 కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిన గ్రామంలో మాత్రమే బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తున్నా. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం.

Also Read..Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు