Home » 5 States Election Results 2022 Live Updates
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది.
2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు.
ఉత్తర్ప్రదేశ్లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది.
ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
దేశమంతా ఎదురుచూస్తోంది. సెమీ ఫైనల్ అంటే ఒప్పుకోకపోయినా.. చాలా పార్టీలు, ఎన్నో వర్గాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడ్ ఆఫ్ నేషన్ గా భావిస్తున్నాయి.