Home » Aam Admi Party
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది.
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మున్సిపాలిటీలో మొత్తం 45 సీట్లు ఉన్నాయి. అందులో 9 నామినేటెడ్ సీట్లు. ఒకటి ఎక్స్ అఫీషియో ఓటు (చండీగఢ్ ఎంపీ). కాగా మిగతా 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది. బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయింది.
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతారని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. సుకేష్ ప్రస్తుతం బీజేపీ భాష నేర్చుకుంటున్నాడని విమర్శించారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.
తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
"ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని" కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు.
పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.