Home » Agriculture pest management
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువ వుంది.
తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.