Brinjal Cultivation : వంగతోటలను నష్టపరుస్తున్న చీడపీడలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువ వుంది.

Brinjal Cultivation
Brinjal Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ వుంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా వుంది.
READ ALSO : Cultivation Of Brinjal : బెంగలేని వంగ సాగు.. ఏడాదిపాటుగా మంచిదిగుబడులు
వీటి తాకిడితో 30 నుండి 50 శాతం వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువ వుంది. ప్రధానంగా ఆకుమచ్చ, వేరుకుళ్లు, మొవ్వు కాయతొలుచు పురుగుల నష్టం అధికంగా కనిపిస్తోంది.
READ ALSO : Health Benefits of Cloves : ఆరోగ్యప్రయోజనాలు అందించే లవంగాలు…వీటిలోని ఔషదగుణాల గురించి తెలిస్తే !
వంగతోటలకు ప్రధాన శత్రువు మొవ్వు కాయతొలుచు పురుగు. ఈ పురుగును సకాలంలో అరికట్టకపోతే కాయ పుచ్చు ఏర్పడి, 30 నుండి 50 శాతం దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు రైతాంగానికి తెలియజేస్తున్నారు.