ఏపీ ప్రభుత్వం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి. రేపు పలు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లో ఇచ్చిన అన్ని హామీలను జగన్ నేరవేర్చారని అని మంత్రి చెప్పారు.(Minister Roja)
32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. 32మందిలో కీలక మంత్రులు కూడా ఉన్నారు. పని తీరు బాగోలేని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు ఉన్నారు.
ఈ నెల 14న గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ కు ఇప్పటికే నివేదికలు అందాయి. ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు జగన్. పరిశీలకులు ఇచ్చిన నివేదికలను కూడా ప్రస్తావించనున్నారు.
కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏపీలో మాత్రం వైసీపీదే అధికారం అని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. తమ సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది.
దేశానికి కేసీఆర్ సారథ్యం అవసరం అన్నారు. కేసీఆర్ కారణజన్ముడు అన్న మంత్రి గంగుల.. ఆయన తెలివితేటలు దేశానికి అవసరం అన్నారు.
అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సమస్యలపై నిలదీసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ రాత్రికి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు