Cm Jagan : నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి?- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ఈ 75ఏళ్ల వయసులో పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది? జగన్ కు తోడు ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు..

Cm Jagan : నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి?- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

Cm Jagan : ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. చంద్రబాబు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. అనకాపల్లిలో మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. చంద్రబాబు నన్ను బచ్చా అంటున్నారు.. నేను బచ్చా అయితే.. నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి బాబూ? నేను బచ్చా అయితే నువ్వు ఏంటి బాబూ? చెప్పు బాబూ చెప్పు అంటూ నిలదీశారు సీఎం జగన్.

”ఈ 75ఏళ్ల వయసులో పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది? మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున.. మరోవైపున చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఎల్లో మీడియా.. వీరందరూ సరిపోరు అన్నట్లుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్దాలు. వీరంతా కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకుని చుట్టూ ఉన్నారు. ఇంతమంది బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసే మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు.

మరి మీ బిడ్డకు తోడెవరు? అంటే.. జగన్ కు తోడు ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని గర్వంగా చెబుతున్నా. ఒక్క జగన్ మీద, మీకు మంచి చేసిన బిడ్డ సింగిల్ గా వచ్చినా.. ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబూ నీకు ఇంత భయం? నేను బచ్చా అయితే, నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరు? ఓ బాబూ నిన్నే అడుగుతున్నా. ఏమనాలి నిన్ను?

నేను బచ్చా అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలటం లేదు. అరడజను మందిని వెనకేసుకి వస్తున్న నిన్ను ఏమనాలి? ఓ బాబూ నిన్ను ఏమనాలి? అని అడుగుతున్నా. నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకు, పేదలకు, పిల్లలకు, అవ్వా తాతలకు, అక్క చెల్లెమ్మళ్లకు, సామాజిక వర్గాలకు నేను చేసిన మంచి, అభివృద్ధి నువ్వు 14ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతున్నా. ఈ బచ్చా చేసిన పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నిన్ను ఏమనాలి అని అడుగుతున్నా” అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్.

”మన సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉక్రోశం, కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి అధికారం కావాలట. మీ బిడ్డ ప్రతీ ఇంటికి మంచి చేశాడు. పెత్తందారులపై యుద్ధానికి అంతా సిద్ధంగా ఉండాలి. నువ్వు పిల్ల బచ్చా అంటున్న నేను.. ధైర్యంగా, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదు?” అని నిలదీశారు జగన్.

Also Read : పవన్ కల్యాణ్‌ను ఓడిస్తా, జగన్‌కు కానుకగా ఇస్తా- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో వంగా గీత