Chevireddy Bhaskar Reddy : వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరం!

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Chevireddy Bhaskar Reddy : వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరం!

Chevireddy

Updated On : March 30, 2023 / 11:06 AM IST

Chevireddy Bhaskar Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు, వైసీపీ పార్టీ నిర్మాణం దృష్ట్యా పార్టీలో పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ ఎన్నికల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.

Andhra pradesh : చంద్రగిరిలో హాట్ టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర..

కాగా, ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్యసభకు వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మోహిత్ రెడ్డికి టిక్కెట్ ఖరారు అయిన నేపథ్యంలో అభిమానుల సందడి నెలకొంది. గత రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పార్టీ కేడర్ పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు.