Andhra pradesh : చంద్రగిరిలో హాట్ టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర..

చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.

Andhra pradesh : చంద్రగిరిలో హాట్ టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర..

Chevireddy Mohith Reddy Padayathra

Chevireddy Mohith Reddy Padayathra : తిరుపతి చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది.గడప గడపకు పాదయాత్ర పేరుతో చేపట్టిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో హీట్ పెంచుతోంది. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. కానీ తన కొడుకుని రాజకీయ రంగంలోకి దించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పినా కొడుకుతో భాస్కర్ రెడ్డి పాదయాత్ర చేయటం వెనుక ఆయన ప్లాన్ ఏంటీ అనే చర్చ నడుస్తోంది చంద్రగిరి నియోజకవర్గంలో. రాజకీయంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కొడుకు మోహిత్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయించటం వెనుక ఆయనకున్న ప్లాన్ ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర మొత్తం 7 నెలల పాటు..ఆరు మండలాలు, 2014 గ్రామాలు, 1600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని ప్రభుత్వ హైస్కూల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దీంతో భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కొడుకుకి టికెట్ ఇప్పించుకుంటారా? జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి పంతం నెగ్గించుకుంటారా? అనే ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్ని తొలుస్తున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

రెండుసార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా నెగ్గిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకదశలో మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుంటారనే టాక్ వచ్చింది. కానీ జగన్ సర్ధి చెప్పటంతో పేచీ పెట్టకుండానే భాస్కర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఈక్రమంలో ఇక కొడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించి ఎంపీటీసీని చేశారు. ఇక ఎమ్మెల్యేగా చేయాలని భాస్కర్ రెడ్డి ప్లాన్. తాను తప్పుకుంటారా? విద్యార్ధి ఉద్యమాల నుంచి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వస్తున్న కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ ను ఒప్పించి టికెట్ ఇప్పించుకుంటారా? అనే ప్రశ్న వస్తోంది. కొడును ఎమ్మెల్యే చేయటానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేస్తున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

కొడుకు పాదయాత్ర గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..తిరుపతి ఎంపీటీసీ హోదాలో నా కుమారుడు మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర ద్వారా ప్రతి గడప గడపకు పంపిస్తున్నా. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో చంద్రగిరి నియోజకవర్గంలో మహా పాదయాత్రకు మోహిత్ రెడ్డి ద్వారా శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఒక నియోజక వర్గంలో ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేసి ఉండరు. ఇదే మొదటిది కావడం నిజంగా గొప్ప విషయం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అవటానికి మోహిత్ రెడ్డి కూడా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవటానికి తాపత్రాయపడుతున్నారు. మరి వీరి ప్లాన్ సక్సెస్ అవుతుందా? జగన్ ను భాస్కర్ రెడ్డి ఒప్పించి కొడుకుకు టికెట్ సాధించుకుంటారా?అనేది తెలియాల్సి ఉంది.