పాఠశాలల సమయాన్ని పొడిగిస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచారు.
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
మూతపడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.