AP : పాఠశాలల సమయం పొడిగింపు..అకాడమిక్ క్యాలెండర్, పని దినాలు ఎన్నంటే

పాఠశాలల సమయాన్ని పొడిగిస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచారు.

AP : పాఠశాలల సమయం పొడిగింపు..అకాడమిక్ క్యాలెండర్, పని దినాలు ఎన్నంటే

Ap Scholls

Updated On : August 19, 2021 / 9:37 AM IST

AP Schools Academic Calendar : ఏపీలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు తెరుచుకున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడిగిస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచారు.

Read More : నేడే AP EAPCET పరీక్షలు

ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలు చేశారు. గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేసేవి. పెంచిన సమయంలో ఐచ్ఛిక పాఠ్యాంశాలు, విరామం కోసం కేటాయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌ బడులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను రూపొందించారు.

Read More : Petrol Rate : 33 రోజులుగా స్థిరంగా పెట్రోల్ ధరలు

గత సంవత్సరం కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో పాఠశాలల సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సమయం పెంతూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 188 రోజులు బడులు పని చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు తరగతులు జరుగనున్నాయి. దీని తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు.