Home » aquaculture
చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది.
ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు.