Fish Farming : మంచి దిగుబడులు సాధించాలంటే చేపల చెరువుల్లో చేపట్టాల్సిన మెళకువలు
చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది.

Fish Farming
Fish Farming : వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే.. ఎలా పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో.. అలాగే చేపల పెంపకంలోనూ అలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది చెరువుల యాజమాన్యం. తక్కువ సమయంలో.. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని పొందాలంటే నాణ్యమైన చేప పిల్లల ఎంపికతో పాటు, ఫీడ్, చెరువుల యాజమాన్యం శాస్త్రీయంగా చేపట్టాలని సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త యశ్వంత్ కుమార్.
READ ALSO : Pest Control : పురుగుల సంతతిని అరికట్టటంతోపాటు, ఉధృతి తగ్గించే సరికొత్త టెక్నాలజీ..
పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు చేరుతోంది. చేప పిల్లలను వదిలేందుకు ఇక సమయం ఆసన్నమైంది. అయితే చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది. మంచినీటి చేపల పెంపకం లాభసాటిగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త యశ్వంత్ కుమార్.
READ ALSO : Pest Control : కూరగాయ తోటలల్లో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు