Pest Control : కూరగాయ తోటలల్లో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది.

Pest Control
Pest Control : తీగజాతి కూరగాయలు సాగుచేసే రైతులకు పండు ఈగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. పిందె దశనుండి కాయ తయారయ్యే దశ వరకు ఈ ఈగ ఆశించి తీవ్రనష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపధ్యంలో పండుఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్ .
READ ALSO : Pest Control : పురుగుల సంతతిని అరికట్టటంతోపాటు, ఉధృతి తగ్గించే సరికొత్త టెక్నాలజీ..
కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు. తరగని డిమాండ్ తో నిత్యావసర ఆహారంగా వున్న కూరగాయల గిరాకీ నానాటికీ పెరుగుతుండటంతో ప్రతి ఏటా వీటి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. శాశ్వత పందిర్ల ఏర్పాటుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
READ ALSO : Vallabhaneni Vamsi : కొన్నిరోజులుగా నో సౌండ్.. అంతుచిక్కని వల్లభనేని వంశీ రాజకీయం, తెరవెనుక ఏం జరుగుతోంది?
అయితే తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది. ఈ ఈగ ఆశించిన కాయలను మార్కెట్ కు తీసుకపోతే సరైన ధర రాదు. కాబట్టి ఏటా ఈ పండుఈగ బెడద వున్న ప్రాంతాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి నిర్మూలించాలని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త , డా. రాం ప్రసాద్ .