Home » Assam Floods
అస్సాంలో సంభవించిన వరదల ధాటికి రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. ప్రధానంగా దిమా హసావో జిల్లాలో రైలు నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినింది. బరాక్ మరియు బ్రహ్మపుత్ర లోయను ఇతర రాష్ట్రాలతో కలిపే రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి
అసోంలో వరదల బీభత్సం
అసోం రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తాయి. వరదల ప్రభావానికి రాష్ట్రంలో ఎనిమిది మంది మరణించారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా అసోం వాసులు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.
ఒకవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండలు, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
అసోంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు.