Home » Beekeeping
రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు.
తేనె టీగల పెంపకానికి సరైన రకాన్ని ఎంచుకోవాలి. పుట్ట తేనే తీగలు, ఐరోపా తినేటీగలు, కొండ తేనెటీగలు, చిన్నవిసనకర్ర తేనెటీగలనే 4 రకాలున్నాయి. రైతుల ఆర్ధిక స్థోమతను బట్టి మొదటి రెండు రకాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి.