Honeybee Farming : తేనెటీగల పెంపకానికి అనువైన తేనెటీగ జాతులు

రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.

Honeybee Farming : తేనెటీగల పెంపకానికి అనువైన తేనెటీగ జాతులు

Honeybee Farming

Updated On : November 25, 2023 / 6:11 PM IST

Honeybee Farming : ఇటీవలి కాలంలో తేనె టీగల పెంపకం వైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. తేనె టీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని కూడా అంటారు. మన చుట్టూ ప్రపంచంలోసహజసిద్ధంగా అనేక రకాల ఈగల జాతులు ఉన్నప్పటికీ అవి వివిధ పుష్పజాతుల పరాగ సంపర్కము నకు సహాయపడతాయి. అయితే తేనెను కూడ బెట్టేందుకు పనికిరావు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

తేనెను కూడబెట్టే ఈగ జాతులుగా ఎఫిస్‌ జాతికి చెందిన ఏడింటిని మాత్రమే ఇప్పటి వరకు గుర్తించారు. ప్రస్తుతం మన దేశంలో తేనెటీగల పెంపకానికి అనువైన జాతులుగా నాలుగు రకాల తేనెటీగలను గుర్తించారు . వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎపెస్‌ మెలిఫెరా (ఐరోపా తేనెటీగలు): ఈ తేనె టీగలను యూరోపియన్‌ బీ అని కూడా అంటారు. ఈ జాతి తేనెటీగలు ఒక్కొక్క తేనె పట్టుకు 25 నుండి 40 కిలోల తేనెను సేకరిస్తాయి.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

ఎఫిస్‌ సెరినా ఇండికా (ఇండియన్‌ బీ): ఈ తేనె టీగలను పుట్ట తేనెటీగలు అని కూడా పిలుస్తారు. ఈ జాతి ఈగలు ఏడాదికి సగటున 6 నుండి 8 కిలోల తేనెను సేకరిస్తాయి.

రాక్‌ బీ(ఎపిస్‌ డార్సటా): వీటిని కొండతేనెటీగలు అని కూడా పిలుస్తారు. ఈ జాతి తేనెటీగలు అత్యధిక తేనెను సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 నుంచి 80 కిలోల తేనెను సేకరిస్తాయి.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

లిటిల్‌ బీ(ఎపిస్‌ షపోరియా) :ఈ జాతి తేనెటీగలు తక్కువ మొత్తంలో తేనెను సేకరిస్తాయి. ఒక్కొక్క తేనె పట్టుకు కేవలం 200 గ్రాముల నుంచి 900 (గ్రాముల తేనెను మాత్రమే సేకరిస్తాయి.

అదే విధంగా కేరళకు చెందిన ట్రిగొనా ఇరిడిపెన్నిస్ అనే పిలవబడే జాతి ఈగలు పరాగ సంపార్కానికి బాగా తోడ్పడతాయి. ఏడాదికి 300 గ్రా నుండి 500 గ్రాములు తేనెను సేకరిస్తాయి.

రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.