Home » Bitter Gourd Cultivation
Bitter Gourd Cultivation : సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి వస్తోంది.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని, తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరిపై సాగుచేస్తున్నారు రైతు మస్తాన్. కూలీల సమస్య ఉండటంతో.. పెట్టుబడి ఎక్కువైనా.. డ్రిప్, మల్చింగ్ విధానంలో సాగుచేస్తున్నారు. సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరి