Bitter Gourd Farming : నిలువు పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం

కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్‌ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.

Bitter Gourd Farming : నిలువు పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం

Bitter Gourd Farming

Updated On : September 6, 2023 / 7:30 AM IST

Bitter Gourd Farming : సంప్రదాయ పంటల స్థానంలో, కూరగాయలను పండిస్తూ.. వినూత్న పద్ధతుల్లో ముందుకు సాగుతున్నారు రైతులు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు, రెండు ఎకరాల్లో నిలువు పందిర్లను ఏర్పాటు చేసుకొని,  తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్‌ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది. దీంతో కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం,  మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు కన్ను బాజీ కాకరను సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం

ఇదిగో ఇక్కడ చూడండీ ఈ వ్యవసాయ క్షేత్రం ఎంత పచ్చగా ఉందో..  ఇందులో బోదేలువేసి,  అందులో డ్రిప్ ఏర్పాటు చేశారు. తీగలు పైకి వెళ్లేలా స్థానికంగా దొరకే కర్రను ఉపయోగించి నిలువు పందిళ్లు ఏర్పాటు చేశారు . మొత్తం ఎకరం 30 సెంట్లో ఈ కాకర పంట వేశారు. మార్కెట్ లో స్థిరమైన ధరలు ఉండటంతో రైతు బాజీ ఈ పంటను సాగుచేస్తున్నారు.  గతంలో పలు సంప్రదా పంటలు వేసి నష్టాలను చవిచూసిన ఈయన తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ఇతర పంటల పంటలతో పోల్చితే కూరగాయల సాగు లాభసాటిగా ఉందంటున్నారు.