Home » BJP leader Vijayashanthi
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు.
బీఆర్ఎస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని చెప్పారు.