Vijayashanthi : కేసీఆర్ పై విజయశాంతి పోటీ..?

రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు.

Vijayashanthi : కేసీఆర్ పై విజయశాంతి పోటీ..?

Vijayashanthi (2)

Vijayashanthi – KCR : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి నుండి పోటీకి సిద్ధం అంటున్నారు. దీనికి విజయశాంతి ట్వీట్స్ బలం చేకూరుస్తున్నాయి. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో తన పోటీ విషయం తమ పార్టీ నిర్ణయింస్తుందని తెలిపారు.

రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అన్నారు. ఇది ప్రజలకు తెలియచేయడం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అన్నారు.

అయితే కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీ చేసేందుకు విజయశాంతి పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.

Telangana Cabinet : నేడే తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రివర్గం నుంచి ఒకరికి ఉద్వాసన?

కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మొదటి జాబితాలను సిద్ధం చేసుకుంటున్నాయి.