Home » Blackgram Cultivation
Blackgram Cultivation : తెలుగు రాష్ట్రాల్లో మినుమును దాదాపు 7 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. మురుగునీరు పోని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.