Blackgram Cultivation : ఖరీఫ్ మినుము సాగులో మెళకువలు

ప్రస్తుతం ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం.  మురుగునీరు పోని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.

Blackgram Cultivation : ఖరీఫ్ మినుము సాగులో మెళకువలు

Blackgram Cultivation

Updated On : May 19, 2023 / 10:40 AM IST

Blackgram Cultivation : స్వల్పకాలంలో పంట చేతికొచ్చి, తక్కువ నీరు శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట  మినుము. మూడు కాలాల్లో సాగుచేసుకోవచ్చు.  అంతర పంటగా కూడా వేసుకొని అధనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్ లో మినుమును  జూన్ 15 నుండి  జూలై 15 వరకు వేసుకోవచ్చు.

READ ALSO : Black Gram : వరిమాగాణుల్లో మినుము సాగుకు అనువైన రకాలు!

రబీ పంటలు వేయబోయే రైతాంగాని తొలకరిలో మినుము సాగు అనుకూలంగా వుంటుంది.  విత్తనం వేసిన దగ్గరనుండి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అదిక దిగుబడులను పొందవచ్చని  వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. పల్లవి అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.  ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 12.5 లక్షల ఎకరాల్లోను, తెలంగాణలో 3లక్షల 75 వేల ఎకరాల్లో సాగవుతుంది.

READ ALSO : Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!

ప్రస్తుతం ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం.  మురుగునీరు పోని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.

అయితే విత్తనం ఎంపిక దగ్గర నుండి పంట కోత దశవరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. పల్లవి చెబుతున్నారు.

READ ALSO : Black Gram : ఖరీఫ్ లో సాగుకు అనువైన మినుము రకాలు!

విత్తనాలను కల్టివేటర్ తో కానీ, గొర్రుతో గాని విత్తుకుంటే మొక్కల సాంద్రత అధికంగా ఉండి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు సకాలంలో  కలుపును నివారించాలి.