Black Gram : ఖరీఫ్ లో సాగుకు అనువైన మినుము రకాలు!

ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగు పై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి శ్రమ, స్వల్పనీటి అవసరాలతో విత్తిన 90రోజుల వ్యవధిలో పంట చేతికి రానున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కనిష్ఠంగా ఆరు నుంచి గరిష్ఠంగా తొమ్మిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

Black Gram : ఖరీఫ్ లో సాగుకు అనువైన మినుము రకాలు!

Black Gram

Black Gram : మన రాష్ట్రంలో మినుమును తొలకరిలోనూ, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు. మురుగు నీరుపోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు ఈ పంటసాగుకు అనువైనవి. చౌడుభూములు పనికిరావు. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలుపడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి. పోషక పదార్థాలు మెండుగా ఉండే మినుములకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగు పై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి శ్రమ, స్వల్పనీటి అవసరాలతో విత్తిన 90రోజుల వ్యవధిలో పంట చేతికి రానున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కనిష్ఠంగా ఆరు నుంచి గరిష్ఠంగా తొమ్మిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

ఖరిఫ్ కు అనువైన రకాలు ;

ఎల్.బి.జి-20: పంట కాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 5-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం, కాయపైన నూగువుండదు. పల్లాకు తెగులును తట్టుకొంటుంది.

టి.9: పంట కాలం 70-75రోజులు. దిగుబడి ఎకరాకు 4-5 క్వి౦టాళ్ళు. కాయమీద నూగు వుండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.

ఎల్.బి.జి.-623(లాం 623): పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వి౦టాళ్ళు, పాలిఫ్ రకం. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.

డబ్ల్యు .బి.జి.-26(వరంగల్-26):పంట కాలం70-75 రోజులు. దిగుబడి ఎకరానుకు 4-5 క్వి౦టాళ్ళు, సాదారకం, కాయల మిద నూగు వుండదు. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమై ఆకులు కప్పబడి ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.