Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!

తామర పురుగు నివారణకు మోనో క్రోటోఫాస్1.6 మి.లీ లేదా, ఎసిఫేట్ 1.0గ్రా , ఫిప్రోనిల్ 1.5 లేదా స్పనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!

Prevention of pests in minumu and pesar crops!

Prevention Of Pests : మినుము, పెసర పంటల్లో తొలిదశలో తామర పురుగుల, తెల్లదోమ, పేనుబంక, కాండపు ఈగ ఎక్కువగా ఆశించటం జరుగుతుంది. రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

చీడపీడల నివారణ ;

కాండం ఈగ ; ఈ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా లేక డైమిథోయేట్ 2.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు ; తామర పురుగు నివారణకు మోనో క్రోటోఫాస్1.6 మి.లీ లేదా, ఎసిఫేట్ 1.0గ్రా , ఫిప్రోనిల్ 1.5 లేదా స్పనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ ; ఈ పురుగు నివారణకు ఒక లీటరు నీటికి ట్రైజోఫాస్ 1.5 మి.లీ లేదా మోనో క్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక ; డైమిథోయేట్ 2.0 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.