Home » chilli cultivation telugu
ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి . పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
విత్తిన తర్వాత నారుమడికి వారం రోజులపాటు ఉదయం, సాయంత్రంపూట రోజ్ కేన్ తో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లైతే తేమ ఆవిరికాకుండా వుండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది.