Chilli Cultivation : మిరపలో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్యపంట మిరప . దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతూ… ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమస్థానంలో వుంది. తెలంగాణా జిల్లాలలో సాధారణంగా జూన్, జూలై నెలల్లో నారుపోసి, ఆగష్టు నుంచి సెప్టెంబరు మొదటి పక్షం వరకు నాట్లు వేయటం పరిపాటి. ఇప్పటికే నార్లు పోసిన రైతాంగం నాట్లుకు సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఖమ్మం కృషివిజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్, డా. జె.హేమంత్ కుమార్.
READ ALSO : Chili Narumadi : అధిక దిగుబడుల కోసం మిరప నారుమడిలో యాజమాన్యం
ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని, నారుమళ్లు పోసుకున్నారు. జులైలో నారు పోసిన వారు ఆగస్టులో, ఆగస్టులో నారు పోసుకున్నవారు సెప్టెంబర్ లో నాట్లు వేసుకునేందుకు అనువు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు నాట్లు వేయగా, మరి కొందరు నాట్లు వేసేందుకు సిద్దమవుతున్నారు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు, నారుకుళ్లు తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సాగు ప్రారంభం నుండే సరైన అవగాహణతో ముందడుగు వేస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం , కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.
READ ALSO : Hybrid Chili Varieties : మిరపలో హైబ్రిడ్ లకు దీటుగా సూటిరకాలు.. అధిక దిగుబడులిస్తున్నలాంఫాం రకాలు
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది. అలాగే ముందస్తుగా కలుపును నివారించుకోవాలి.
రైతులు ఎర్రబంగారంగా పిలుచుకునే మిరప సాగులో ప్రారంభం నుంచే చీడపీడల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. నాటిన తొలిదశ నుంచే రసం పీల్చుపురుగులు పైరుపై దాడి చేసి, పలు వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా పనిచేస్తాయి. కాబట్టి వీటి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలంటారు శాస్ర్తవేత్త.
READ ALSO : Tamara Purugu Disease : తామర పురుగులను తట్టుకునే మిరప రకం
మిరప నాణ్యతను, దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో పోషక యాజమాన్యం అత్యంత కీలకమైనది. ప్రాంతాలకు తగ్గట్లుగా, నేలలను అనుసరించి ఎరువులను అందించాల్సి వుంటుంది. సిఫారసు మేరకు మాత్రమే పోషకాలను అందించనట్లయితే చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపులో వుంచే అవకాశం వుంటుంది.