Tamara Purugu Disease : తామర పురుగులను తట్టుకునే మిరప రకం
రెండేళ్లుగా భారతదేశ వ్యాప్తంగా మిరప రైతులకు తలనొప్పిగా మారింది నల్లతామర పురుగు. ఇవి ఆశించి మిరపతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మిరప పంట వేయాలంటే రైతు జంకుతున్నారు.

Tamara Purugu Disease
Tamara Purugu Disease : మిరప రైతులకు శుభవార్త.. నల్లతామర పురుగును తట్టుకునే నూతన మిరప రకం అందుబాటులోకి వచ్చింది. నూజివీడు సీడ్స్ వారి రూపొందించిన NCH-6889 రకం నల్ల తామర పురుగు సమర్థవంతంగా తట్టుకొని సత్ఫలితాలను ఇస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన రైతు క్షేత్రాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.
READ ALSO : Cultivation Of Mirchi Crop : లాభదాయకంగా పచ్చిమిర్చి సాగు
రెండేళ్లుగా భారతదేశ వ్యాప్తంగా మిరప రైతులకు తలనొప్పిగా మారింది నల్లతామర పురుగు. ఇవి ఆశించి మిరపతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మిరప పంట వేయాలంటే రైతు జంకుతున్నారు.
ఈ నేపధ్యంలో నూజివీడు సీడ్స్ సంస్థ రూపొందించిన NCH-6889 మిరప రకాన్ని రూపొందించింది. ఆంద్రప్రదేశ్ తో పాటు మిర్చి పండించే ఇతర రాష్ట్రాలలో రెండేల్లుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నారు. తామర పురుగును సమర్థవంతంగా తట్టుకుంటుందని నిర్ధారించారు. ఇటీవల గుంటూరు జిల్లా, తాడికొండ మండలం , ఫణి ధరం గ్రామంలో NCH-6889 మిరప రకం సాగుచేసిన ఓ రైతు క్షేత్రాన్ని పరిశీలించారు.