Home » Covid-19 Delta variant
వుహాన్ పరిస్థితులపై శాస్త్రవేత్తల భయం భయం
ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్.. అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఆల్ఫా వేరియంట్ (Alpha Variant) కంటే డెల్టా వేరియంట్ 40 నుంచి 60 శాతం వేగంగా వ్యాపించగలదని నిపుణుల కమిటీ పేర్కొంది.
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది.